![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -16 లో...... అంజలి వెళ్లిపోతుంటే రాజారావు ఆపుతాడు. నువ్వు బయటకు వెళ్లడం వద్దమ్మా.. ఇక్కడే ఉండు అని అంటాడు. తిని కూర్చొని ఉండలేను తాతయ్య అని అంజలి అనగానే నీ ఆత్మగౌరవం నాకు తెలుసు అమ్మ వట్టిగానే ఏం కాదు నా భార్యని చూసుకో చాలు అని చెప్తాడు. దానికి అంజలి ఒప్పుకుంటుంది. అంజలిని తన భార్య రత్నం దగ్గరికి తీసుకొని వెళ్లి పరిచయం చేస్తాడు. అమ్మమ్మ అని పిలువు అని రాజారావు అనగానే రత్నం ఇంక వాళ్ళ మనవరాలు షాక్ అవుతుంది.
అంటే నన్ను తాతయ్య అని పిలిచినప్పుడు నిన్ను అమ్మమ్మ అనే కదా పిలవాలని చెప్తాడు. రత్నంని తీసుకొని అంజలి లోపలికి వెళ్తుంది. మరొకవైపు గీతంజలి కి ఎడ్యుకేషన్ మినిస్టర్ కాల్ చేసి వైజాగ్ లో ఇని స్టిట్యూట్ కి పర్మిషన్ క్యాన్సిల్ అయింది. ఆ రోజు ఒకమ్మాయి గొడవ చేసింది కదా.. అది న్యూస్ వైరల్ అయిందని అతను చెప్తాడు. దాంతో గీతంజలి షాక్ అవుతుంది. ఆ విషయం వెంటనే భానుచందర్ కి చెప్తుంది. ఆ అమ్మాయిని అసలు వదిలిపెట్టనని గీతాంజలి అనుకుంటుంది. మరొకవైపు అంజలి వాళ్ళ అమ్మ ఎక్కడ ఉందో అని తలుచుకొని బాధపడుతుంది.
ఆ తర్వాత మనీష్ ఇంటికి వస్తాడు. తనని అంజలి చూసి తన దగ్గరికి వెళ్లి నా వెంట పడొద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావని తనని గేట్ బయటకు పంపిస్తుంది. అప్పుడే సెక్యూరిటీ వస్తాడు. అన్న ఒకతను ఏడిపిస్తున్నాడని అంజలి అతనికి చెప్తుంది. వాడి సంగతి చెప్తానని గేట్ తీసి చూసేసరికి మనీష్ ఉంటాడు. సర్ నమస్తే అని సెక్యూరిటీ చెప్పగానే ఏంటి అతనేదో నీ ఓనర్ అయినట్టు అని అంజలి అనగానే అతను మా ఓనర్ అమ్మ అని సెక్యూరిటీ అనగానే అంజలి షాక్ అవుతుంది. తరువాయి భాగంలో ఆ అంజలి ఎక్కడున్నా ఇక్కడికి తీసుకొని రా ఈ ప్రాబ్లమ్ తనే సాల్వ్ చెయ్యాలని మనీష్ తో గీతాంజలి చెప్తుంది. దాంతో మనిష్ వెంటనే అంజలి దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |